jio 5G services

* జియో 5జీ టార్గెట్‌: జియో న్యూ ప్లాన్స్‌* 5G సేవలు

దేశీయ ప్రయివేటు టెలికాం దిగ్గజం రిలయన్స్‌ సంస్థ జియో టెలికాం సేవల రంగంలో మరింత దూసుకుపోతోంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలతో కస‍్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. దేశంలో 5జీ సేవలను అందించేందుకు అమెరికా ఆధారిత టెలికాం సొల్యూషన్స్ సంస్థను కొనుగోలు చేయనుంది. అమెరికాకు చెందిన రాడీసిస్‌తో ఒప్పందంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంతకాలు చేసింది.

ఓపెన్‌ టెలికాం సొల్యూషన్స్‌లో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న రాడిసిస్‌ కార్పొరేషన్‌ కొనుగోలుకు ఒక ఒప్పందం చేసుకున్నామని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ డీల్‌ యొక్క విలువ సుమారుగా 74మిలియన్ డాలర్లు. భారతీయులకు 5జీ, ఇంటర్నెట్ ఆఫ్‌ థింక్స్‌ (ఐఓటీ) లాంటి సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నామని జియో వెల్లడించింది. ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ అనుమతితోపాటు, రాడిసిస్‌ వాటా దారుల సమ్మతి పొందాల్సి ఉందని తెలిపింది.

2018 చివరి(నాలుగు) త్రైమాసికానికి ఈ డీల్‌ పూర్తికానుందని భావిస్తోంది. అలాగే అంతర్గత లావాదేవీల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తోంది.

రాడిసిస్‌కు చెందిన టాప్-క్లాస్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ టీం రిలయన్స్‌కు త్వరిత ఆవిష్కరణ పరిష్కార అభివృద్ధి నైపుణ్యాలను అందిస్తుందని,
తద్వారా వినియోగదారులు సేవలు మెరుగవుతాయని రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాష్ అంబానీ చెప్పారు.
నాస్డాక్-లిస్టెడ్ కంపెనీగా రాడిసిస్‌కు ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు, మద్దతు కార్యాలయాలతో పాటు, బెంగళూరులో కూడా ఒక ఇంజనీరింగ్‌ టీమ్‌ కలిగి ఉందని రెండు సంస్థల ఉమ్మడి ప్రకటన లో తెలియజేసింది .

5g ప్రవేశం ద్వారా డేటా పరంగా ఇంకా చాల అభివృద్ధి సాధించవచ్చు అన్ని నిపుణులు ఆశిస్తున్నారు …

jio prime membership free

జియో వినియోదారులందరి శుభవార్త

99 /- జియో ప్రైమ్ మెంబెర్షిప్ జియో ఒక సంవసరం పాటు ఫీజ్ లేకుండా
ఫ్రీగా అందించడం జరుగుతుంది

దీన్ని పొందడం కొరకు మీ యొక్క మై జియో అప్ లోకి వెళ్లి గెట్ నౌ( Get Now) అని కనిపిస్తుంది
దాన్ని ప్రెస్ చేసి మీరు ఒక సంవసరం పాటు ఉచితంగా సర్వీసెస్ ను పొందగలరు .

జియో ‘డబుల్’‌ డేటా ధమాకా!

 టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో తన ప్రీపెయిడ్‌ వినియోగదారులను ఆకట్టుకునేందుకు డబుల్‌ ధమాకా ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఇస్తున్న జియో ఇప్పుడు అదనపు డేటాను ఇవ్వనుంది. రూ.149, రూ.399 రీఛార్జి చేసుకుంటే వచ్చే డేటాతో అదనంగా రోజుకు 1.5జీబీ డేటాను ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది.
కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆఫర్‌ కింద ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.149, రూ.349, రూ.399, రూ.449తో రీఛార్జి చేసుకుంటే వారికి డైలీ డేటా 1.5తో పాటు అదనంగా మరో 1.5జీబీ డేటాను పొందనున్నారు. అంటే మొత్తం 3జీబీ డేటాను జియో అందిస్తోంది.
అలాగే రూ.198, రూ.398, రూ.448, రూ.498 రీఛార్జి చేసుకుంటే ఇప్పటి వరకు రోజుకు 2జీబీ డేటాను మాత్రమే పొందగలుగుతున్నారు. ఇక మీదట 3.5జీబీ డేటాను పొందవచ్చు.
ఇక రూ.299, రూ.509, రూ.799తో రీఛార్జి చేసుకుంటే వరుసగా రోజుకు 4.5జీబీ, 5.5జీబీ, 6.5జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. దీంతో పాటు జియో రూ.300కి పైగా రీఛార్జి చేసుకున్న వినియోగదారులకు వంద రూపాయలు డిస్కౌంట్‌ ప్రకటించింది. రూ.300కంటే తక్కువ రీఛార్జి చేసుకుంటే 20శాతం డిస్కౌంట్‌ను వినియోగదారులకు లభించనుంది. అయితే.. ఈ రీఛార్జిలు మై జియో యాప్‌, ఫోన్‌పే వ్యాలెట్‌ ద్వారా చేసుకుంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆఫర్లు.. జూన్‌ 30 2018వరకు అందుబాటులో ఉంటాయి.
మీ యొక్క అదనపు
డేటా మీ యొక్క
My Jio లో vouchers లో అందుబాటులో ఉంటుంది
దానిని reddeem చేసుకోవాలి…….